IPL 2022: ఐపీఎల్‌లో ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా!

16 Apr, 2022 07:33 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడిగా ఫించ్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా  సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగడం ద్వారా ఫించ్‌ ఐపీఎల్‌లో అత్యధికంగా తొమ్మిది జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా  గుర్తింపు పొందాడు.

గతంలో ఫించ్‌... రాజస్తాన్‌ రాయల్స్‌ (2010), ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (2011–2012), పుణే వారియర్స్‌ (2013), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2014), ముంబై ఇండియన్స్‌ (2015), గుజరాత్‌ లయన్స్‌ (2016, 2017), కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (2018), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (2020) జట్లకు ఆడాడు. ఫించ్‌ తర్వాత ఈ జాబితాలో దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ఇషాంత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌ (6 జట్లు చొప్పున) రెండో స్థానంలో ఉన్నారు.

చదవండి: IPL 2022: అంపైర్‌ పొరపాటు ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చింది

>
మరిన్ని వార్తలు