AB De Villiers: ఆర్‌సీబీ కోచ్‌గా ఏబీ డివిలియర్స్‌!

5 Dec, 2021 12:04 IST|Sakshi

AB De Villiers Could Return To RCB Batting Coach: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌సీబీ..  ఫ్యాన్స్‌కు త్వరలో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. వచ్చే సీజన్‌కు గాను ఆర్‌సీబీ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా డివిలియర్స్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్‌ 360తో ఆర్‌సీబీ  సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంకేతాలను ఆర్‌సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌- భారత్‌ రెండో టెస్ట్‌లో కామెంటేటర్‌గా  సంజయ్ బంగర్ వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు. ఏబీ డివిల్లియర్స్‌ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ పదవిని ఇస్తే మా జట్టు ఆటగాళ్లకి ఎంతో ఉపయోగకరమని అతడు తెలిపాడు. ‘ప్రధాన కోచ్‌గా నాకు ఎక్కువ సమయం ఉండదు. బ్యాటింగ్ కోచ్ ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆటగాళ్ల లోపాలపై దృష్టిసారిస్తాడు. అందువల్ల, ప్రతి జట్టుకు ప్రధాన కోచ్ కాకుండా బ్యాటింగ్ కోచ్ అవసరం. అందుకే ఏబీ డివిలియర్స్‌ను బ్యాటింగ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్ కోచ్‌గా నియమించడానికి ప్రయత్నిస్తున్నాం" అని బంగర్‌ తెలిపాడు. కాగా సంజయ్ బంగర్ ఆర్‌సీబీ బ్యాటింగ్‌ కోచ్‌నుంచి హెడ్‌ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs NZ: అది నా డ్రీమ్‌ బాల్‌.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్

మరిన్ని వార్తలు