IND Vs ENG 5th Test: 'టెస్టు క్రికెట్‌లో నేను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే'

4 Jul, 2022 15:54 IST|Sakshi
File Photo

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజాపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్‌, జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదుకున్న సంగతి తెలిసిం‍దే. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 222 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. పంత్‌ 146 పరుగులు సాధించగా, జడేజా 104 పరుగులు చేశాడు. "నేను ఇంటి వద్ద లేకపోవడంతో అద్భుతమైన మ్యాచ్‌ను వీక్షించలేకపోయాను.

కానీ హైలెట్స్‌ను మాత్రం మిస్ కాకుండా చూశాను. ఈ మ్యాచ్‌లో బౌలర్లపై ఎదురుదాడికి దిగి పంత్‌, జడేజా రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. నేను టెస్టు క్రికెట్‌లో చూసిన అత్యత్తుమ భాగస్వామ్యం" ఇదే అని ట్విటర్‌లో డివిలియర్స్‌ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో  416 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  284 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో  జానీ బెయిర్‌ స్టో(106 పరుగులు) తప్ప మిగితా బ్యాటర్ల అంతా విఫలమయ్యారు.
చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు