సగం దక్షిణాఫ్రికావాడినైతే, సగం భారతీయుడిని: ఏబీ డివిలియర్స్‌

20 Nov, 2021 00:59 IST|Sakshi

మా ఇంటి వెనక అన్నయ్యలతో కలిసి క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన నాటినుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎప్పుడూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆటను ఆస్వాదించాను. అయితే ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి ప్రేరణ నాలో ఉండటం లేదు. దీనిని అంగీకరించాలి కాబట్టి బాధగా అనిపిస్తున్నా సరే, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. క్రికెట్‌ ప్రపంచం నాకు ఎన్నో గొప్ప అవకాశాలు అందించింది. అయితే ఆట నుంచి తప్పుకొని కుటుంబంతో గడిపేందుకు ఇది సరైన సమయంగా అనిపించింది.

నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉన్న బెంగళూరు అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ ఫ్రాంచైజీ నా జీవితాన్ని మార్చేసింది. నేను జీవితకాలం ఆర్‌సీబీవాడినే. ఇన్నేళ్లుగా ఐపీఎల్‌ కారణంగా భారత్‌తో నా అనుబంధం మరింత పెరిగింది. ఇక్కడ గడిపిన ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. సరిగ్గా చెప్పాలంటే నేను సగం దక్షిణాఫ్రికావాడినైతే సగం భారతీయుడిని. కాగా, మిస్టర్‌ 360 డిగ్రీస్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌.. ఐపీఎల్‌ సహా అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు