ఫ్యాన్స్‌కు కోహ్లి, ఏబీలు సర్‌ప్రైజ్‌

21 Sep, 2020 17:40 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌ కోసం సన్నద్ధమైంది. ఈరోజు(సోమవారం) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. కోవిడ్‌-19 వారియర్స్‌కు ఘనమైన నివాళులు అర్పించడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా తమ జెర్సీపై ‘ మై కోవిడ్‌ హీరోస్‌’ అని ముద్రించింది. కాగా, ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్‌లు ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

ఈ కొత్త సీజన్‌ను ఫ్రెష్‌ గా ఆరంభించాలనే ఉద్దేశంతో తమ సోషల్‌ మీడియాలో అకౌంట్ల పేర్లను మార్చేసుకున్నారు.‘పారితోష్‌ పంత్‌’ అంటూ డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను మార్చుకోగా, ‘సిమ్రాన్‌జీత్‌ సింగ్‌’ అంటూ కోహ్లి తన ట్వీటర్‌ అకౌంట్‌ పేరును మార్చుకున్నాడు. అదే సమయంలో కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ డీపీలో సిమ్రాన్‌జీత్‌ సింగ్‌ పేరుతో కనిపిస్తున్నాడు.  పారితోష్‌ పంత్‌-17 జెర్సీతో ఏబీ, సిమ్రాన్‌జీత్‌ సింగ్‌-18 జెర్సీతో కోహ్లిలు కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాను సోషల్‌ మీడియా హ్యాండిల్‌ పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో కారణం చెప్పుకొచ్చాడు ఏబీడీ. పారితోష్‌ పంత్‌ అనే రెస్టారెంట్‌ ఓనర్‌ ప్రాజెక్ట్‌ ఫీడింగ్‌ పేరుతో ఎంతోమంది పేద ప్రజలకు లాక్‌డౌన్‌ సమయంలో ఆహారాన్ని అందించాడన్నాడు. దీనిపై ట్వీటర్‌లో ఏబీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక కోవిడ్‌ యోధుడ్ని ఇలా గౌరవించడం నిజంగా అభినందనీయమని ఏబీని కొనియాడుతున్నారు. కోహ్లి కూడా ఇదే కారణంతో తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను మార్పుకుని ఉండవచ్చు. కానీ దీనిపై కోహ్లి ఏమి చెబుతాడో చూడాలి.(చదవండి: రాయుడి కసి.. కోహ్లికి అర్థమవుతుందా?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు