IPL 2023: భువనేశ్వర్‌ కాదు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తదుపరి కెప్టెన్‌ అతడే!

16 Nov, 2022 21:58 IST|Sakshi

ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శరన కనబరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే ఐపీఎల్‌-2023 మినీవేలంకు ముందు విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచిపెట్టింది. వీరితోపాటు మరో 10 మంది ఆటగాళ్లను కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ వేలంలో పెట్టింది.

ఈ మినీవేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ పర్స్‌లో రూ.42.25 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో యువ ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును పటిష్టం చేసుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. ఇక విలియమ్సన్‌ను విడిచిపెట్టడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ తదుపరి కెప్టెన్‌ ఎవరన్నది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు యువ ఆటగాడు అభిషేక్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని హైదరాబాద్‌ జట్టు మేనేజేమెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా అభిషేక్‌ శర్మ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ షేర్‌ చేయడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. అంతే కాకుండా ఈ వీడియోకు 'వీర శూర' క్యాప్షన్‌ పెట్టింది.  ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో అభిషేక్‌ శర్మ అదరగొట్టాడు. ఐపీఎల్‌-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ 426 పరుగులు సాధించాడు.

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.,భువనేశ్వర్‌ ​కుమార్‌

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

మరిన్ని వార్తలు