పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరం!

24 Mar, 2021 14:29 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు ఆడే తొలి మ్యాచ్‌కు అత‌డు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్ట‌ర్ మైక్ హెస‌న్ ధృవీక‌రించారు. ఏప్రిల్ 9న త‌న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో విదేశీ ప్లేయ‌ర్స్ అందుబాటులో ఉండ‌టం లేదని, ఆడ‌మ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని హెస‌న్ చెప్పారు.

ఐపీఎల్ కోసం మార్చి 29 నుంచి ఆర్సీబీ త‌మ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించ‌బోతోంది. గ‌తేడాది ఆర్సీబీ త‌ర‌ఫున జంపా కేవ‌లం మూడు మ్యాచ్‌లే ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ ఏప్రిల్‌ 9న మొదలై.. మే30 వరకు జరగనుంది.  కాగా ఆడమ్‌ జంపా ఆసీస్‌ తరపున 61 వన్డేల్లో 92 వికెట్లు, 41 టీ20ల్లో 43 వికెట్లు, 14 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసుకున్నాడు.
చదవండి:
టీమిండియాకు షాక్‌.. కీలక ఆటగాడు దూరం!
వైరల్‌: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌‌‌‌‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు