Afghanistan Tour Of India 2022: రెండేళ్ల షెడ్యూల్‌.. భారత్‌తో వన్డే సిరీస్‌ ఎప్పుడంటే!

14 Dec, 2021 11:43 IST|Sakshi

Afghanistan Tour Of India 2022: వచ్చే రెండేళ్లకు గానూ అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తంగా 37 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. అదే విధంగా కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నట్లు వెల్లడించింది. ఇక ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌-2022, వన్డే వరల్డ్‌కప్‌ 2023 తదితర మూడు ఐసీసీ మెగా ఈవెంట్లలో పాల్గొనన్నుట్లు పేర్కొంది. 

ఈ మేరకు.. ‘‘2022-23 ఏడాదికి సంబంధించి మా షెడ్యూల్‌ ప్రకటిస్తున్నాం. ఈ రెండేళ్ల కాలంలో మొత్తంగా 37 వన్డేలు, 12 టీ20లు, 3 టెస్టులు ఆడతాం. అంతేగాక ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు ఆడనున్నాం’’ అని అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా వివరాలు వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌తో అఫ్గన్‌ క్రికెట్‌ జట్టు కొత్త ఏడాదిని ఆరంభించనుంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో భారత పర్యటనకు రానున్న అఫ్గన్‌ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

చదవండి: IND Vs SA: టీమిండియాకు మరో షాక్‌.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి! ఎందుకంటే!
Trolls On Rohit Sharma: వైస్‌ కెప్టెన్‌ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ!

మరిన్ని వార్తలు