తాలిబన్‌ ముప్పు.. పాక్‌ చేరిన అఫ్ఘాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు

16 Sep, 2021 08:06 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అఫ్ఘానిస్తాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు సురక్షితంగా పాకిస్తాన్‌ చేరుకుంది. తాలిబన్‌ ప్రభుత్వం నుంచి మహిళా ఫుట్‌బాలర్లకు ముప్పు ఉండటంతో 32 మంది తమ కుటుంబసభ్యులతో సహా పొరుగుదేశం పాక్‌లో అడుగుపెట్టారు. నిజానికి ఈ జట్టు ఖతర్‌కు బయల్దేరాలనుకుంది. కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లుగప్పి పాక్‌కు చేరుకుంది.

తాలిబన్‌ సర్కారు పురుషుల క్రీడలకు అనుమతించినప్పటికీ మహిళలు షరియా చట్టాల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై మహిళా ఫుట్‌బాలర్లు విమర్శలకు దిగడంతో తాలిబన్లు వారిని నిర్బంధించాలనుంది. బ్రిటన్‌కు చెందిన ఎన్‌జీవో సహకారంతో ఫుట్‌బాలర్లకు పాక్‌ అత్యవసర వీసాలు జారీ చేసింది. వీరికి పెషావర్‌ లేదంటే లాహోర్‌లో బస ఏర్పాటు చేసే అవకాశముంది.  

>
మరిన్ని వార్తలు