IND Vs AFG Super-4: ఆఫ్గన్‌తో మ్యాచ్‌.. రోహిత్‌కు రెస్ట్‌.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

8 Sep, 2022 19:12 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4లో ఇవాళ(గురువారం) భారత్‌, అఫ్గనిస్తాన్‌ల మధ్య నామమాత్రపు పోరు జరగనుంది. శ్రీటాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్‌ రోహిత్‌, హార్దిక్‌ పాండ్యా, చహల్‌ స్థానాల్లో దినేశ్‌ కార్తిక్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌లు తుది  జట్టులోకి వచ్చారు. అఫ్గనిస్తాన్‌ జట్టులో ఎలాంటి మార్పు లేదు.

లంక, పాకిస్తాన్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన టీమిండియా కనీసం అఫ్గన్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఫ్గనిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ పోరాట పటిమ అందరిని ఆకట్టుకుంది. దాదాపు పాక్‌ను ఓడించినంత పని చేసిన అఫ్గనిస్తాన్‌.. ఆఖరి ఓవర్లో చేసిన తప్పిదంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. 

భారత్ జట్టు: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్

అఫ్గనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరూఖీ

మరిన్ని వార్తలు