సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్‌

31 May, 2021 13:55 IST|Sakshi

ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను వార్నర్‌ భార్య కాండిస్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా..ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే.  దీంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. అయితే ఆస్ట్రేయాలో ప్రయాణాలపై నిషేధం కారణంగా ఆ దేశానికి చెందిన క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తమ దేశ ఆటగాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లాల్సి వచ్చింది.  

కాగా ఐపీఎల్‌ 2021లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కేవలం ఒక్కటే మ్యాచ్‌ గెలిచి చివరి స్థానంలో ఉంది. దీంతో సన్‌ రైజర్స్‌ జట్టు యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను కేన్‌ విలియమ్సన్‌కు అప్పగించింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో మిగిన అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సన్‌ రైజర్స్‌కు ప్లే ఆఫ్‌లో చోటు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యుఏఈలో జరుగుతాయని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసీసీఐ) ధృవీకరించిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్యాలెండర్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.

ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ కూడా తనకు కాబోయే ఫియాన్సీ బెకీ బోస్టన్‌ని కలుసుకున్నాడు. 


(చదవండి: Xavier Doherty: వడ్రంగిగా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌!)


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు