‘చెస్‌’లో కలిసిపోయారు!

22 Aug, 2021 09:09 IST|Sakshi

లక్నో: చెస్‌లో ఏళ్లతరబడి రెండు పాలక వర్గాల గందరగోళానికి, వైరానికి తెరపడింది. ఇపుడు దేశమంతా ఒకే పాలకవర్గం చెస్‌ వ్యవహారాలను చక్కబెట్టనుంది. అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌), భారత చెస్‌ సంఘం (సీఏఐ) విలీనానికి సై అన్నాయి. ఇది రాష్ట్ర సంఘాలకే కాదు... ఆటగాళ్లకు కూడా కచ్చితంగా శుభవార్తే! ఎన్నో ఏళ్లుగా అటు ఏఐసీఎఫ్, ఇటు సీఏఐ మేమంటే మేమే అధికారిక జాతీయ సమాఖ్య అంటూ వివాదాలు సృష్టించాయి.

దీంతో అధికారిక టోరీ్నలేవో, గుర్తింపులేని టోరీ్నలేవో తెలుసుకోవడం చెస్‌ ప్లేయర్లకు కష్టంగా ఉండేది. దీనివల్ల ఎన్నో జాతీయ టోరీ్నలు సజావుగా సాగలేదు. అంతర్జాతీయ టోరీ్నలైతే ఇటువైపే కన్నెత్తి చూడని పరిస్థితి. ఇప్పుడు వైరివర్గాలు కలిసిపోయేందుకు అంగీకరించడంతో భారత్‌లో టోరీ్నల నిర్వహణ సజావుగా సాగే అవకాశముంది. చెస్‌ అభివృద్ధికి విలీన ప్రక్రియ దోహదం చేస్తుందని ఏఐసీఎఫ్‌ అధ్యక్షుడు సంజయ్‌ కపూర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. 

కింగ్‌స్టన్‌: పాకిస్తాన్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటను వర్షం ఆటంకపరిచింది. దీంతో శనివారం తొలి సెషన్‌ పూర్తిగా రద్దయ్యింది. తొలి రోజు ఆరంభంలో తడబడిన పాకిస్తాన్‌ అనంతరం బాబర్‌ ఆజమ్‌ (75; 13 ఫోర్లు), ఫవాద్‌ అలమ్‌ (76; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కోలుకుంది. ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు