ఇర్ఫాన్ పఠాన్‌‌ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌: కోబ్రా ఫ్టస్‌లుక్‌ విడుదల

28 Oct, 2020 12:45 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు అజయ్‌ జ్ఞానముతు సర్ప్‌రైజ్‌ ఇచ్చాడు. నిన్న(​అక్టోబర్ 27)న ఇర్ఫాన్‌ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్‌ మంగళవారం ట్వీట్‌ చేస్తూ ఇర్ఫాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్‌ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తూ.. ‘డియర్‌ ఇర్ఫాన్ సార్‌ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న. మీలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే అస్లాన్‌ యిల్మాజ్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు. ఈ పోస్టర్‌లో ఇర్ఫాన్‌ బ్లాక్‌ సూట్‌ ధరించి స్టైలిష్‌గా కనిపించాడు. ఇందులో ఆయన ఫ్రెంచ్‌ ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్ అస్లాన్‌ యిల్మాజ్‌గా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్‌ వెల్లడించాడు. 

అయితే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇర్ఫాన్‌ తనకు నటన అంటే ఇష్టమని పలు ఇంటర్య్వులో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్‌ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటించి  కోలీవుడ్‌తో తన యాక్టింగ్‌ కేరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సియాన్‌ విక్రమ్‌ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం మార్చిలో రష్యాకు వెళ్లిన విషయం తెలిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర బృందం ఇండియాకు తిరిగి వచ్చింది.  భారత్‌తో కూడా షూటింగ్‌లపై నిషేధం విధించిన కేంద్రం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో చిత్రికరించాల్సిన కీలక సన్నివేశాలను చెన్నైలోనే రష్యాను పోలిన సెట్టింగ్‌లతోనే దర్శకుడు షూటింగ్‌ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ‘కోబ్రా’ షూటింగ్‌ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది. విక్రమ్ హరోగా‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు