కోహ్లి.. నువ్వు చెప్పింది ఏమిటి.. చేసిందేమిటి?: మాజీ క్రికెటర్‌

14 Mar, 2021 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం కావడం పట్ల మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా చూపుతూ రోహిత్‌ శర్మను తొలి మ్యాచ్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడంతో వీరేంద్ర సెహ్వాగ్‌ ధ్వజమెత్తగా,  మరో మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా సైతం విమర్శలు గుప్పించాడు. ‘న్యూ అగ్రెసివ్‌ అప్రోచ్‌’తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నామంటూ మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ కోహ్లి తెలపడాన్ని జడేజా ప్రధానంగా ప్రశ్నించాడు. ఇదేనా న్యూ అగ్రెసివ్‌ అ‍ప్రోచ్‌ అంటూ ఎద్దేశా చేశాడు. ఇక్కడ ఫలితం విషయాన్ని పక్కన పెట్టి, కోహ్లి మాట్లాడిన దానికి, మ్యాచ్‌కు సిద్ధమైన దానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ నిలదీశాడు.  ‘ తొలి టీ20 ఫలితాన్ని కాసేపు పక్కన పెడదాం. మ్యాచ్‌కు ముందు కోహ్లి ఏం చెప్పాడు.  న్యూ అగ్రెసివ్‌ అప్రోచ్‌తో మ్యాచ్‌కు సిద్దమవుతున్నామన్నాడు. అదేంటో నాకైతే అర్థం కాలేదు. శిఖర్‌ ధావన్‌ వచ్చాడు. ధావన్‌ ఆట గురించి మనకు తెలుసు. ఇక్కడ చదవండి: పృథ్వీ షా బ్యాటింగ్‌ రికార్డు

ఇక కేఎల్‌ రాహుల్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి చాలాకాలం అయ్యింది. గతంలో మిడిల్‌ ఆర్డర్‌లో సంజూ శాంసన్‌ ఆడాడు. పంత్‌ స్థానంలో అప్పుడు అతనికి చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌కు పంత్‌ అందుబాటులోకి వచ్చాడు. ఇక్కడ కొత్త ప్రయోగం అంటూ కోహ్లి చెప్పాడు. ఏ రకంగా చెప్పాడో నాకైతే అర్థం కాలేదు. మీరు న్యూ అగ్రెసివ్‌ అప్రోచ్‌తో ముందుకెళితే, మనకున్న వనరుల్ని(యువ క్రికెటర్లు) కచ్చితంగా వాడుకోవాలి.  ఉదాహరణకు ఎవరూ కూడా చతేశ్వర్‌ పుజారాను ఎటాక్‌ చేయమని, వీరేంద్ర సెహ్వాగ్‌ను డిఫెన్స్‌ ఆడమని చెప్పరు కదా.  అలానే ఎవరి బ్యాటింగ్‌ స్టైల్‌ను మార్చుకోమని చెప్పరు. ఉన్న వనురుల్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది.  కొత్త ప్రయోగం చేయాలంటే రిషభ్‌ పంత్‌ను ఓపెనింగ్‌ పంపవచ్చు. ఆ తర్వాత హార్దిక్‌ను దూకుడుగా ఆడటానికి ఒక ప్రయోగం కూడా చేయవచ్చు. ఇటువంటి ఏమీ లేనప్పుడు న్యూ అగ్రెసివ్‌ అప్రోచ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైనట్లు కోహ్లి ఎలా చెప్పాడు’ అంటూ అజయ్‌ జడేజా విమర్శించాడు. ఇక్కడ చదవండి: మిథాలీ రాజ్‌ మరో అరుదైన ఘనత.. 

మరిన్ని వార్తలు