కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న రహానే దంపతులు

8 May, 2021 19:32 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్ మొద‌టి డోసు వేయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. 'నేను, నా భార్య రాధిక ధోప‌వకర్‌ ఇవాళ వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్నాం. మేము కేవ‌లం మా కోస‌మే కాకుండా, మా చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరు రిజిస్ట్రేష‌న్ చేసుకుని వ్యాక్సిన్ తీకోవాల‌ని కోరుతున్నా' అంటూ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఇంతకముందు రహానే కోవిడ్‌ రోగులకు సహాయంగా ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్స్‌ను మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

కాగా టీమిండియా ఓపెనర్ శిఖ‌ర్ ధావ‌న్ కూడా క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బయోబబుల్‌ సెక్యూర్‌కు కరోనా మహమ్మారి సెగ తగలడంతో బీసీసీఐ లీగ్‌ను రద్దు చేసింది. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కాగా అజింక్య రహానే ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో దుమ్మురేపింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. 
చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు