రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి

30 Dec, 2020 21:35 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే మరో అరుదైన ఘనత సాధించాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో 112 పరుగులతో చెలరేగిన రహానే భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్‌ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి కావడం విశేషం. (చదవండి : 'క్వారంటైన్‌ తర్వాత మరింత యంగ్‌ అయ్యావు')

ప్రతిష్టాత్మక హానర్స్‌ బోర్దులో ఆస్ట్రేలియా గ్రౌండ్‌ సిబ్బంది  తన పేరును చెక్కే వీడియో క్లిప్‌ను బీసీసీఐ ట్విటర్లో షేర్‌ చేసింది. 2014లో తొలిసారి రహానే  పేరును హానర్స్‌ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్‌లో రహానే 147 రన్స్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ ఇదే మైదానంలో 169 చేసి హానర్స్‌ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. పర్యాటక జట్లకు చెందిన ఆటగాళ్లు టెస్టు సెంచరీ లేదా కనీసం ఐదు వికెట్లు తీసిన వారి పేర్లను హానర్స్‌ బోర్డులో చేర్చుతారు. ఇక ఆసీస్‌, భారత్‌ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి మొదలుకానుంది. (చదవండి : డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌.. బర్న్స్‌ అవుట్‌)

మరిన్ని వార్తలు