T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

15 Sep, 2022 17:15 IST|Sakshi
PC: PCB twitter

టీ20 ప్రపంచకప్‌-2022కు ముం‍దు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌తో పాటు, టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్ లతీఫ్ కూడా వెల్లడించాడు. కాగా ఆసియా కప్‌-2022లో పాకిస్తాన్‌జట్టులో భాగంగా ఉన్న జమాన్‌ అంతగా అకట్టుకోలేపోయాడు.

ఈ మెగా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన జమాన్‌ కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన ఫైనల్లో ఫఖర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. "ఫఖర్‌ జమాన్‌ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతోంది. అతడు త్వరగా కోలుకోని జట్టులో చేరాలని ఆశిస్తున్నాను. మరోవైపు షాహీన్ అఫ్రిది కూడా ఇదే గాయంతో బాధపడుతున్నాడు" అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు పాక్‌ జట్టును పీసీబి గురువారం ప్రకటించే అవకాశం ఉంది.
చదవండిBabar Azam: అతడి కెరీర్‌ నాశనం చేస్తున్నారు! బాబర్‌ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్‌ ఏ టోర్నీ గెలవలేదు!

మరిన్ని వార్తలు