సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌

1 Sep, 2020 17:00 IST|Sakshi

దుబాయ్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. ఇటీవల కరోనా వైరస్‌ బారినపడ్డ 13 మంది కోలుకున్నారని తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్‌కే సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యంతో పాటు ఐపీఎల్‌ నిర్వహకులు తీవ్ర ఆందోళన చెందారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19న సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడనుంది. (రైనాకు ఎప్పుడైనా అండగా ఉంటాం)

మిగతా జట్లన్నీ క్వారెంటైన్‌ పూర్తి చేసుకుని మైదానంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టగా.. కరోనా కారణంగా చెన్నై ఆటగాళ్లు మాత్ర ఇంకా హోటల్‌ గదులకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్రారంభ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా లేదని, షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ ఆటగాళ్లంతా కోలుకున్నారని జట్టు సీఈఓ ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది. త్వరలోనే చెన్నై ప్లేయర్లు ప్రాక్టీస్‌ను సైతం ప్రారంభించే అవకాశం ఉంది. (రైనాను సీఎస్‌కే వదులుకున్నట్లేనా..!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు