Tony Brooks: ఫార్ములావన్‌ దిగ్గజ రేసర్‌ కన్నుమూత

4 May, 2022 18:12 IST|Sakshi
టోనీ బ్రూక్స్‌(ఫైల్‌ ఫోటో)

ఫార్ములావన్‌ దిగ్గజం టోనీ బ్రూక్స్‌ కన్నుమూశాడు. 90 ఏళ్ల టోనీ బ్రూక్స్‌ కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా  బుధవారం బ్రూక్స్‌ తుది శ్వాస విడిచినట్లు అతని కూతురు గులియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా 'రేసింగ్‌ డెంటిస్ట్‌'గా పేరు పొందిన బ్రూక్స్‌ 1957లో బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ ద్వారా కెరీర్‌లో తొలి విజయంతో పాటు మెయిడెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

తన కెరీర్‌లో 38 రేసుల్లో పాల్గొన్న టోనీ బ్రూక్స్‌ 10సార్లు ఫోడియం పొజిషన్‌ అందుకున్నాడు. ఆరు గ్రాండ్‌ప్రిక్స్‌ టోర్నీల్లో విజయాలు అందుకున్న బ్రూక్స్‌ ఖాతాలో బ్రిటీష్‌, బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ గ్రాండ్‌ప్రిక్స్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 1959లో ఎఫ్‌ 1 చాంపియన్‌షిప్‌ టైటిల్‌ పొందే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. 29 ఏళ్ల వయసులోనే ఫార్ములావన్‌కు గుడ్‌బై చెప్పిన టోనీ బ్రూక్స్‌ వాన్‌మాల్‌, ఫెరారీ, కూపర్‌ టీమ్‌ల తరపున బరిలోకి దిగాడు.

చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం

మరిన్ని వార్తలు