Womens ODI Rankings: అగ్రస్థానానికి దూసుకొచ్చిన అలీసా హీలీ

5 Apr, 2022 19:12 IST|Sakshi

Alyssa Healy: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా కొనసాగుతుంది. బ్యాటింగ్‌ విభాగం టాప్ 10లో ఏకంగా నలుగురు ఆసీస్‌ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌ కప్‌ 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారీ సెంచరీ (170) సాధించిన ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (785 రేటింగ్‌ పాయింట్లు) నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్‌కే చెందిన బెత్‌ మూనీ (748) 3వ స్థానంలో, కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ (710), ఓపెనర్‌ రేచల్‌ హేన్స్‌లు 5, 6 స్థానాల్లో నిలిచారు. 


ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ నథాలి సీవర్ (750) రెండో స్థానానికి ఎగబాకగా, దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లారా వొల్వార్డ్ నాలుగో స్థానానికి దిగజారింది.  టీమిండియా నుంచి మిథాలీ రాజ్‌ (686) ఏడో స్థానాన్ని దక్కించుకోగా, స్టార్‌ బ్యాటర్‌ స్మ్రతి మంధాన (669) తొమ్మిదో ప్లేస్‌కు చేరుకుంది. కాగా, అలీసా హీలీ.. ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 509  పరుగులు చేసి, ఆసీస్‌ ఏడోసారి జగజ్జేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 
చదవండి: 'మెస్సీ.. పిల్లలపై కనికరం చూపించలేవా'

మరిన్ని వార్తలు