బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!

26 Oct, 2020 16:18 IST|Sakshi
ఫోటో సోర్స్‌( డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వీఐపీ)

దుబాయ్‌: ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  రుతురాజ్‌ గైక్వాడ్‌  51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌లో రుతురాజ్‌-ధోనిలు బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని  21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు.  రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లతో 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.  (ఆర్చర్‌ ఆరేళ్ల క్రితం మాట.. ఇప్పుడెలా సాధ్యం?)

కాగా, మ్యాచ్‌ జరిగేటప్పుడు టైమ్‌ ఔట్‌ సెషన్‌లో అంబటి రాయుడు ఫీల్డ్‌ను విడిచి బాత్రూమ్‌కు వెళ్లిన క్రమంలో గేమ్‌ చాలాసేపు ఆగిపోయింది. 2నిమిషాల 30 సెకన్ల బ్రేక్‌ పూర్తైన తర్వాత ఆటగాళ్లంతా ఎవరి స్థానాల్లో వారు వచ్చేస్తే, క్రీజ్‌లోకి రావాల్సిన ఉన్న రాయుడు కనిపించలేదు. దాంతో కామెంటేటర్లు తమదైన శైలిలో చలోక్తులు విసిరారు. ‘బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ మిస్సింగ్‌’ అంటూ ఒక కామెంటేటర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. రాయుడు రావడం ఆలస్యం కావడంతో మ్యాచ్‌ చాలానిమిషాలు నిలిచిపోయింది. కాసేపటికి రాయుడు పరుగెత్తుకుంటూ ఫీల్డ్‌లోకి రావడమే కాకుండా ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ ఏబీ డివిలియర్స్‌కు క్షమాపణలు తెలియజేశాడు. ప్యాడ్లు కట్టుకునే సమయంలో రాయుడితో ఏబీ ముచ్చటిస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు. అటు తర్వాత మూడు బాల్స్‌ మాత్రమే ఆడిన రాయుడు పెవిలియన్‌ చేరాడు. చహల్‌ వేసిన 14 ఓవర్‌ మూడో బంతికి రాయుడు బౌల్డ్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు