IPL 2022 - Ambati Rayudu: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌.. మరో స్టార్‌ ఆటగాడు దూరం!

11 Mar, 2022 12:07 IST|Sakshi

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. ఐపీఎల్‌ 2022 సన్నాహకాల్లో భాగంగా సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్‌ క్యాంప్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ జట్టు బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే రాయుడు చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్కే నెట్‌ బౌలర్‌ రాకీ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిం‍దే. ఈ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన వీడియోను  సోషల్‌ మీడియాలో సీఎస్కే పోస్టు చేసింది.

ఈ వీడియోలో రాయుడు చేతికి బ్యాండేజ్‌ వేసుకుని కనిపించాడు. ఇక రాయుడు గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో రాయుడు ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌ మెగా వేలంలో రాయుడుని చెన్నై రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది.  ఇక ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ సగం సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా మార్చి 26న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో  వాంఖడే వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

చెన్నైసూప‌ర్ కింగ్స్ జట్టుఎంఎస్‌ ధోని (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ (8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (4.4 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జోర్డాన్‌( 3.6 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు), ఆడమ్ మిల్నే (1.9 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.2 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.5 కోట్లు), డేవాన్‌ కాన్వే (రూ. కోటి), మహీష్ తీక్షణ (70 లక్షలు), ప్రిటోరియస్ ( 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్ (20 లక్షలు), తుషార్‌ దేశ్‌పాండే (20 లక్షలు), సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (20 లక్షలు), శుభ్రాన్ష్‌ సేనాపతి (20 లక్షలు), ముకేశ్‌ చౌధరి (20 లక్షలు), జగదీశన్‌ (20 లక్షలు), హరి నిషాంత్‌(20 లక్షలు)

చదవండి: IPL 2022: నెట్‌ బౌలర్‌ జన్మదిన వేడుకలను దగ్గరుండి జరిపించిన ధోని

మరిన్ని వార్తలు