Amit Mishra Vs Shahid Afridi: 'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌

25 May, 2022 20:06 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్‌ మాలిక్‌ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్‌ మిశ్రా అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. యాసిన్ మాలిక్  నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్‌ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.

అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది..  అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా  నేరాన్ని అంగీకరించాడు.  అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. 

చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్‌లో పాక్‌ బౌలర్‌ కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు