Anand Mahindra-Kohli: 'నిజమైన హీరోలు సైలెంట్‌గా దూసుకొస్తారు.. ‍కోహ్లి లాగే'

9 Sep, 2022 11:11 IST|Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించిన వేళ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఆసియా కప్‌ నుంటి టీమిండియా వైదొలిగిందన్న విషయాన్ని కోహ్లి తన ఒక్క సెంచరీతో మరిపించేశాడు. కోహ్లి 71వ సెంచరీ కోసం దాదాపు వెయ్యి రోజులకు పైనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆసియాకప్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లికి టి20ల్లో ఇదే తొలి సెంచరీ. 

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నిజమైన హీరోలు సైలెంట్‌గా వస్తారు.. విమర్శించిన వారిపై మాటలతో కాకుండా పంచులతోనే సమాధానమిస్తారు.అచ్చం కోహ్లి లాగే. కంగ్రాట్స్‌.. మరోసారి వింటేజ్‌ కోహ్లిని తలపించావు'' అంటూ కామెంట్‌ చేశాడు. కాగా ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. టోర్నీలో ఇదే అత్యధికస్కోరు. విరాట్‌ కోహ్లి(61 బంతుల్లో 122 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేసింది. భువనేశ్వర్‌ (4–1–4–5) పేస్‌ దెబ్బకు 9 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్‌ జట్టులో ఇబ్రహీం (64 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు.  

చదవండి: KL Rahul: రిపోర్టర్‌​ ప్రశ్నకు చిర్రెత్తిన రాహుల్‌.. 'డగౌట్‌లో కూర్చోమంటున్నారా?'

Neeraj Chopra: ఎదురులేని నీరజ్‌ చోప్రా.. పట్టిందల్లా బంగారమే

మరిన్ని వార్తలు