‘ఫ్రెంచ్‌’ రాణి ఎవరో?

12 Jun, 2021 03:55 IST|Sakshi

పావ్లుచెంకోవా, క్రిచికోవా మధ్య నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

అంచనాలకు అందనిరీతిలో సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అన్‌సీడెడ్‌ బర్బోర క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌), 31వ సీడ్‌ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. నేడు జరిగే ఫైనల్లో గెలిచిన వారు తమ కెరీర్‌లో తొలిసారి సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరిస్తారు.

29 ఏళ్ల పావ్లుచెంకోవా 51 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడాక తొలిసారి ‘గ్రాండ్‌’ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ‘డబుల్స్‌ స్పెషలిస్ట్‌’ అయిన 25 ఏళ్ల క్రిచికోవా తన ఐదో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరింది. క్రిచికోవాకు అరుదైన ‘డబుల్‌’ సాధించే అవకాశం కూడా ఉంది. ఆమె మహిళల డబుల్స్‌ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో క్రిచికోవా–కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 6–1, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్‌)–బెర్నార్డా పెరా (అమెరికా) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్‌ (అమెరికా)– స్వియాటెక్‌ (పోలాండ్‌) జోడీతో క్రిచికోవా–సినియకోవా ద్వయం ఆడతుంది. 2000లో మేరీ పియర్స్‌ మాత్రమే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకే ఏడాది మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ సాధించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు