జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆంధ్ర జట్లకు చాంపియన్‌షిప్‌ 

13 Aug, 2021 11:18 IST|Sakshi
జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సబ్‌ జూనియర్‌ విభాగంలో విన్నర్, రన్నర్‌గా నిలిచిన ఆంధ్ర బాలురు, బాలికల జట్లు-  పసిడి పతకంతో పావనికుమారి  

6 పసిడి, 8 వెండి పతకాలు కైవసం 

ఏలూరు రూరల్‌/సత్తెనపల్లి: జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఆంధ్ర జట్టు లిఫ్టర్లు చాంపియన్‌షిప్‌ సాధించారని రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య గురువారం తెలిపారు. పంజాబ్‌లోని పటియాలలో 3 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన బాలబాలికలు అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. జూనియర్, సబ్‌ జూనియర్‌ విభాగాల్లో 6 బంగారు,8 వెండి పతకాలు సొంతం చేసుకున్నారని వివరించారు. ఫలితంగా సబ్‌ జూనియర్‌ బాలుర జట్టు విన్నర్స్‌ ట్రోఫీ కైవసం చేసుకోగా, బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచిందని వెల్లడించారు. పతకం సాధించిన వారిలో విజయనగరం, విశాఖ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల లిఫ్టర్లు ఉన్నట్లు వివరించారు. జట్టు కోచ్‌గా సీతాభవాని ఉన్నారు.

పావని ప్రతిభ.. 
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఏజీకేఎం కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కేవీ పావని కుమారి జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ బాలికల వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 45 కేజీల విభాగంలో స్నాచ్‌లో 69 కేజీలు, క్లీన్, జెర్క్‌లో 82 కేజీలతో మొత్తం 151 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకుంది. జూనియర్స్‌ విభాగంలో 151 కేజీల బరువు ఎత్తి రజత పతకం కైవసం చేసుకుంది. పావనికుమారిని కళాశాల పాలకవర ్గఅధ్యక్షుడు అన్నం సత్యనారాయణ అభినందించారు.   

మరిన్ని వార్తలు