ఆంధ్ర క్రికెటర్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలి

23 Oct, 2020 06:01 IST|Sakshi
టోర్నీని ప్రారంభిస్తున్న ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి

ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్ష

టి20 లీగ్‌ టోర్నీ ప్రారంభం  

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.    ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్‌ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో కింగ్స్‌ ఎలెవన్‌పై 6 వికెట్లతో టైటాన్స్‌ ఎలెవన్‌ గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో చార్జర్స్‌ ఎలెవన్‌ జట్టు  56 పరుగులతో లెజెండ్స్‌ ఎలెవన్‌ను ఓడించింది.
  ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటశివారెడ్డి, ట్రెజరర్‌ గోపీనాథ్‌రెడ్డి, అండర్‌–14 ఆంధ్ర జట్టు సెలెక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్, మాజీ క్రికెటర్‌ షాబుద్దీన్‌ తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు