IPL 2022: హండ్రెడ్ లీగ్‌లో ఆడనున్న ఐపీఎల్‌ స్టార్లు

2 Apr, 2022 11:27 IST|Sakshi
Photo Courtesy: Sky Sports

The Hundred League: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్‌ సీజన్‌ 2022 వేలం ఏప్రిల్‌ 5న జరుగనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. తొలి సీజన్‌తో పోలిస్తే.. ఈ ఏడాది లీగ్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ స్టార్లు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. లీగ్‌లో ఆడేందుకు 16 దేశాలకు చెందిన 534 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. వీరిలో 284 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. లీగ్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. ఆయా జట్లు 42 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. వీరిలో 25 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు, 17 మంది ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఉన్నారు.

కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2022 సీజన్‌లో పాల్గొనేందుకు ఆండ్రీ రసెల్‌, డేవిడ్‌ వార్నర్‌, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, డ్వేన్‌ బ్రావో, హెట్మైర్, మార్క్రమ్, ఓడియన్‌ స్మిత్‌, వనిందు హసరంగ, భానుక రాజపక్స, దసున్ శనక, రొమారియో షెపర్డ్ వంటి ఐపీఎల్‌ స్టార్లు ఎగబడటం ఆసక్తి కలిగిస్తుంది. ఐపీఎల్‌తో పోలిస్తే.. ఈ ఆటగాళ్లకు హండ్రెడ్‌ లీగ్‌లో దక్కే పారితోషికం చాలా తక్కువ.

ఐపీఎల్‌ 2022లో 10.75 కోట్ల భారీ మొత్తం దక్కించుకున్న విండీస్‌ క్రికెటర్‌ నికోలస్‌ పూరన్‌ హండ్రెడ్‌ లీగ్‌లో 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంలో (వేలంలో) పోటీపడుతుండగా, ఐపీఎల్‌లో 10 కోట్లు అందుకుంటున్న లంక మిస్టరీ స్పిన్నర్‌ హసరంగ 50 లక్షల రిజర్వ్ ప్రైస్ విభాగంలో, 8.5 కోట్లు అందుకుంటున్న హెట్మైర్‌, 7.75 కోట్లు అందుకుంటున్న రొమారియో షెఫర్డ్ 40 లక్షల రిజర్వ్‌ ప్రైస్ విభాగంలో పోటీపడుతుండటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది.

హండ్రెడ్ లీగ్‌ 2022 వేలంలో స్లాబ్‌లు, విదేశీ ఆటగాళ్ల వివరాలు..

రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్: బాబర్ ఆజమ్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, షంషీ

రూ. 99 లక్షల రిజర్వ్ ప్రైస్: షకిబ్ అల్ హసన్, క్వింటన్ డికాక్, జై రిచర్డ్సన్, ఆండ్రీ రసెల్

రూ. 75 లక్షల రిజర్వ్ ప్రైస్: మహ్మద్ అమీర్, డ్వేన్ బ్రావో, నాథన్ కౌల్టర్ నీల్, ఆరోన్ ఫించ్, షాదాబ్ ఖాన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, హరిస్ రౌఫ్, ఇమ్రాన్ తాహిర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్

రూ. 60 లక్షల రిజర్వ్ ప్రైస్: సీన్ అబోట్, ఫిన్ అలెన్, హిట్మైర్, మార్క్రమ్, ఫెహ్లుక్వాయో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ సాంట్నర్, ఓడియన్ స్మిత్, విల్ యంగ్, ఆడమ్ జంపా

రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైస్: అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, మార్టిన్ గప్తిల్, వనిందు హసరంగ, హెన్రిక్స్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, షోయబ్‌ మాలిక్, డారిల్ మిచెల్ , కొలిన్ మున్రో, జేమ్స్ పాటిన్సన్, భానుక రాజపక్స, రూథర్‌ఫోర్డ్, మాథ్యూ వేడ్

రూ. 40 లక్షల రిజర్వ్ ప్రైస్: క్రిస్ లిన్, తిసారా పెరీరా, దసున్ శనక, రొమారియో షెపర్డ్, లెండిల్‌ సిమన్స్, ఇమాద్ వసీం
చదవండి: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఏప్రిల్‌ 6 నుంచి..!

మరిన్ని వార్తలు