CPL 2021: శివాలెత్తిన రసెల్‌.. అతి భారీ స్కోర్‌ నమోదు చేసిన జమైకా తలైవాస్‌

27 Aug, 2021 21:56 IST|Sakshi

సెయింట్‌ కిట్స్‌: కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) 2021 సీజన్‌లో భాగంగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్‌(14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్‌ చరిత్రలో తన జట్టు రెండో అతి భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రసెల్‌ విధ్వంసానికి తోడు చాడ్విక్‌ వాల్టన్‌(29 బంతులో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెన్నార్‌ లూయిస్‌(21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), హైదర్‌ అలీ(32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ రోమన్‌ పావెల్‌(26 బంతులో 38; 3 ఫోర్లు,  సిక్సర్లు) చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. జమైకా తైలవాస్‌ టాపార్డర్‌ ధాటికి ప్రత్యర్ధి బౌలర్లు వణిపోయారు. సెయింట్‌ లూసియా కింగ్స్‌ బౌలర్లలో ఓబెద్‌ మెక్‌ కాయ్‌ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్‌ ఛేజ్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్‌ లూసియా జట్టు ఆరంభంలోనే తడబడింది. జమైకా బౌలర్‌ ప్రిటోరియస్‌(3/25) సెయింట్‌ లూసియా జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి క్రిస్‌ గ్రీన్‌(1/22), ఆండ్రీ రసెల్‌(1/9) తోడవ్వడంతో  5 ఓవర్ల తర్వాత సెయింట్‌ లూసియా స్కోర్‌ 56/5. ఆ జట్టు గెలవాలంటే  90 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది.
చదవండి: నీకంత సీన్‌ లేదంటూ ఆ ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు..

మరిన్ని వార్తలు