Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..

5 Dec, 2021 08:46 IST|Sakshi

Andre Russell helps Deccan Gladiators crowned champions of Abu Dhabi T10 Season 5: ఆండ్రీ రస్సెల్ విద్వంసం సృష్టించడంతో తొలిసారిగా అబుదాబి టీ10 టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ ముద్దాడింది. డిసెంబర్‌ 4న జరిగిన ఫైనల్లో ఢిల్లీ బుల్స్‌పై  56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడిబ్యాటింగ్‌ దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఓపెనర్లు రస్సెల్, కోహ్లర్-కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 159 పరుగల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నీర్ణీత 10 ఓవరల్లో వికెట్‌ నష్టపోకుండా గ్లాడియేటర్స్ 159 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

ఆండ్రీ రస్సెల్ కేవలం 32 బంతుల్లో 9 ఫోర్లు , 7 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. అదే విధంగా  కోహ్లర్-కాడ్మోర్  3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బుల్స్‌ నీర్ణీత 10 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బుల్స్‌ బ్యాటరల్లో చంద్రపాల్ హేమ్‌రాజ్ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలరల్లో ఒడియన్ స్మిత్, వనిందు హసరంగా, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఆండ్రీ రస్సెల్ ఎంపికకగా, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ను వనిందు హసరంగా దక్కించుకున్నాడు.

చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్‌! ఏమా బౌలింగ్‌.. ధనాధన్‌గా ‘టెన్‌’ రికార్డు

మరిన్ని వార్తలు