ఆండ్రీ రసెల్‌ వి‘ధ్వంసం’

22 Sep, 2020 17:51 IST|Sakshi
ఆండ్రీ రసెల్‌(ఫోటో కర్టసీ: కేకేఆర్‌.ఇన్‌)

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) రేపు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తలపడనుంది. దీనిలో భాగంగా కేకేఆర్‌ తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు.  ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపిన రసెల్‌ భారీ షాట్లతో అలరించాడు.  కాగా, రసెల్‌ ప్రాక్టీస్‌ చేసే క్రమంలో ఎదురుగా ఉన్న కెమెరా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో కేకేఆర్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ పోస్ట్‌ చేసింది. ఓహ్‌.. అదొక స్మాషింగ్‌ షాట్‌.. చివరి షాట్‌ వరకూ వెయిట్‌ చేయండి అంటూ క్యాప్షన్‌లో పేర్కొంది.(చదవండి: ఏబీ డివిలియర్స్‌@ 200)

గతేడాది ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున రసెల్‌ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో 57.00 యావరేజ్‌, 205 స్టైక్‌రేట్‌తో రసెల్‌ 504 పరుగులు సాధించాడు. అదే సమయంలో కేకేఆర్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్‌లో రసెల్‌ 11 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ సీజన్‌లో సైతం రసెల్‌పై కేకేఆర్‌ భారీ ఆశలు పెట్టుకుంది. కచ్చితంగా రసెల్‌ మరోసారి మెరిపించి కేకేఆర్‌కు విజయాలు సాధించి పెడతాడనే ధీమాలో ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.(చదవండి: రికార్డు బ్రేక్‌ చేసిన ఐపీఎల్‌ మ్యాచ్‌)

మరిన్ని వార్తలు