'బయోబబుల్‌ నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది'

3 Jun, 2021 19:00 IST|Sakshi

దుబాయ్‌: కరోనా మహమ్మారి వల్ల పదేపదే బయోబబూల్‌ సెక్యూర్‌లో ఉండడం వల్ల తన మెంటల్‌ హెల్త్‌ దెబ్బతింటుందని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ పేర్కొన్నాడు. తాజాగా పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్న రసెల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

''నేను చేసిన ఈ వ్యాఖ్యలు నాకు మాత్రమే పరిమితం. బయోబబూల్‌ ఒక నరకంలా కనిపిస్తుంది.. అది నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది. రెండేళ్లుగా బయోబబుల్‌ అనే పదం ఎక్కువగా వినాల్సి వస్తుంది.ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా భారత్‌లో అడుగపెట్టిన నేను బయోబబూల్‌లో ఉండాల్సి వచ్చింది. అలా ఒక బయోబబూల్‌ నుంచి మరోచోటికి వెళ్లిన నాకు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, నచ్చిన ప్రదేశం.. కనీసం బయట నడిచేందుకు కూడా ఉండేది కాదు. ఇది నిజంగా నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ తట్టుకోవడానికి ఒకటే కారణం. బయోబబూల్‌లో ఉంటున్నా నాకు ఇష్టమైన క్రికెట్‌ను ఆడుతున్నా.. ఇది గొప్ప విషయంగా భావిస్తున్నా.. నా జాబ్‌ నేను నిర్వహిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా రసెల్‌ పీఎస్‌ఎల్‌లో క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో కరోనా మహమ్మారితో వాయిదా పడిన పీఎస్‌ఎల్‌ను నిర్వహించేందుకు పీసీబీ సమాయత్తమవుతుంది. జూన్‌ 9 నుంచి 24 వరకు యూఏఈ వేదికగా పీఎస్‌ఎల్‌ జరగనుంది.
చదవండి: పాపం మంచి షాట్‌ ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు  

చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్‌

మరిన్ని వార్తలు