ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌: క్వార్టర్‌ ఫైనల్లో అంకిత

25 Sep, 2021 12:32 IST|Sakshi

యాంక్టన్‌ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్‌ అంకిత భకత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కోల్‌కతాకు చెందిన 23 ఏళ్ల అంకిత ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కాంగ్‌ చె యంగ్‌ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన కొరియా జట్టులో కాంగ్‌ చె యంగ్‌ సభ్యురాలిగా ఉంది.

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన అంకిత రెండో రౌండ్‌లో 7–3తో జిండ్రిస్కా వనెస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, మూడో రౌండ్‌లో 7–1తో అలెగ్జాండ్రా మిర్కా (మాల్డోవా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన కోమలికా బారి మూడో రౌండ్‌లో 2–6తో కాంగ్‌ చె యంగ్‌ చేతిలో, రిధి 4–6తో సుగిమోటో తొమోమి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. 

చదవండి: Ostrava Open: సెమీఫైనల్లో సానియా మీర్జా జోడీ 

మరిన్ని వార్తలు