IPL 2022: నోర్ట్జేకు చేదు అనుభవం.. బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు 

7 Apr, 2022 23:24 IST|Sakshi
Courtesy: IPL Twitter

భారత గడ్డపై తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జేకు చేదు అనుభవం ఎదురైంది. తన వరుస ఓవర్లలో రెండు బీమర్లు(హై ఫుల్‌టాస్‌ బంతి) వేయడంతో అంపైర్లు నోర్జ్టే బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్నారు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్‌ రెండు బీమర్‌లు వేస్తే మ్యాచ్‌ పూర్తయ్యేవరకు సదరు బౌలర్‌కు మళ్లీ బౌలింగ్‌ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా నోర్ట్జే విషయంలో అదే జరిగింది.

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతిని నోర్జ్టే డికాక్‌కు బీమర్‌ వేశాడు. 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని డికాక్‌ కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. అంపైర్‌ బీమర్‌ అని వార్నింగ్‌ ఇచ్చి నో బాల్‌గా పరిగణించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన నోర్ట్జే.. ఆ ఓవర్‌ మూడో బంతిని మరోసారి బీమర్‌ వేశాడు. దీపక్‌ హుడాకు చాలా ఎత్తులో వెళ్లిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. హుడా సింగిల్‌ కంప్లీట్‌ చేయగా.. అంపైర్లు దానిని బీమర్‌గా పరిగణించి నోర్జ్టేను బౌలింగ్‌ చేయకుండా అడ్డుకున్నారు.

దీంతో మిగిలిన నాలుగు బంతులను కుల్దీప్‌ యాదవ్‌ వేశాడు. నోర్ట్జేకు ఒక రకంగా బ్యాడ్‌లక్‌ అనే చెప్పొచ్చు. ఇక నోర్ట్జేకు భారత్‌ గడ్డపై ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. 2020 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న నోర్ట్జే ఆ సీజన్‌ మొత్తం యూఏఈలోనే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2021 సీజన్‌లో టీమిండియాలో జరిగిన తొలి అంచె పోటీలకు దూరమైన నోర్ట్జే.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీల్లో పాల్గొన్నాడు. అలా రెండు సీజన్ల పాటు విదేశాల్లోనే ఆడి.. మూడో సీజన్‌ ద్వారా భారత్‌ గడ్డపై ఆడుతున్న తొలి క్రికెటర్‌గా నోర్ట్జే చరిత్ర సృష్టించాడు. 

చదవండి: IPL 2022: 'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్‌?!'

మరిన్ని వార్తలు