ఐపీఎల్‌ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

15 Oct, 2020 15:51 IST|Sakshi

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ అన్‌రిచ్‌ నోర్జే ఫాస్టెస్ట్‌ డెలివరీతో రికార్డు సాధించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నోర్జే ఈ ఫీట్‌ నమోదు చేశాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 156. 22కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలోనే వేగవంతమైన డెలివరీ నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా నోర్జే వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి ఈ రికార్డును సాధించాడు.  బట్లర్‌ క్రీజ్‌లో ఉండగా నోర్జే వేగవంతమైన బంతిని సంధించాడు. ఈ బంతికి బట్లర్‌కు సైతం దిమ్మతిరిగింది. కానీ దూసుకువచ్చిన ఆ బంతిని బట్లర్‌ చాకచక్యంగా ఆడాడు. ఆ ఓవర్‌ తదుపరి బంతినే 155.1 కి.మీ వేగంతో సంధించాడు. దీనికి బట్లర్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. దాన్ని ఆడలేక బౌల్డ్‌ అయ్యాడు. అది 155పైగా వేగంతో రావడంతో బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. (‘కోహ్లి, ఏబీని ఐపీఎల్‌ నుంచి నిషేధించండి’)

రాజస్తాన్‌ తో మ్యాచ్‌లో నోర్జే ఆరు బంతుల్ని 150కి.మీ పైగా వేయడం విశేషం. కాగా, ఈ సీజన్‌ తొలి మూడు ఫాస్టెస్ట్‌ బంతులు నోర్జే పేరిటే ఉన్నాయి. అంతకుముందు 155.21 కి.మీ, 154.74 కి.మీ వేగంతో బంతలు వేశాడు నోర్జే. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగంతో వేస్తున్న బంతులు బౌలర్‌ నోర్జే. కాగా, ఆ తర్వాత స్థానంలో రాజస్తాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఉన్నాడు.  ఈ సీజన్‌లో 150 కి.మీ వేగాన్ని  దాటిన తొలి బౌలర్‌ ఆర్చర్‌. కానీ ఇప్పుడు వేగంలో ఆర్చర్‌కు నోర్జే పోటీగా ఉన్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 161 పరుగుల స్కోరును కాపాడుకుని జయకేతనం ఎగురువేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ లెగ్‌ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. మళ్లీ రాజస్తాన్‌పై పైచేయి సాధించి డబుల్‌ ధమాకా కొట్టింది. . రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో నోకియా రెండు వికెట్లు సాధించాడు.(ధోని కెప్టెన్సీ మ్యాజిక్‌)

మరిన్ని వార్తలు