Virat Kohli-Anushka Sharma: 'మై లవ్‌.. నేను ఎప్పటికి నీతోనే'

9 Sep, 2022 09:10 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా కోహ్లికి టి20ల్లో ఇదే మెయిడెన్‌ సెంచరీ. దాదాపు వెయ్యి రోజుల తర్వాత వచ్చిన సెంచరీ .. అందునా పొట్టి ఫార్మాట్‌లో తొలి శతకం కావడంతో కోహ్లి.. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు.

'' 70 సెంచరీలు చేసిన నాకు 71వ సెంచరీని అందుకోవడం కోసం వెయ్యి రోజులు పట్టింది. ఈ గడ్డు కాలంలో నాకు అండగా నిలబడింది నా డియార్‌ వైఫ్‌.. అనుష్క శర్మ. అందుకే సెంచరీ కాగానే మెడలో ఉన్న రింగ్‌ను కిస్‌ చేశా. ఆమెకు ఈ సెంచరీని అంకితమిస్తున్నా. ఆమెతో పాటు నా ముద్దుల కూతురు వామికాకు కూడా...'' అంటూ తెలిపాడు.

కాగా కోహ్లి ఎమోషనల్‌ వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ అతని భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. ''సందర్భం ఏదైనా.. ఎలాంటిదైనా సరే.. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.. మై లవ్‌'' అంటూ సింగిల్‌ లైన్‌ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక టి20ల్లో తొలి సెంచరీ అందుకున్న కోహ్లికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 71వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్‌ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. సచిన్‌ (100  సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లి.. టి20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును అందుకొని చరిత్ర సృష్టించాడు. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటివరకు టి20 క్రికెట్‌లో 10 సెంచరీలు నమోదు చేశారు. కోహ్లి కంటే ముందు రోహిత్‌ (4 సెంచరీలు), రాహుల్‌ (2), రైనా, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఘనత సాధించారు. ఇక  కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్‌ 23న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ సాధించాడు. 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

చదవండి: Kohli-KL Rahul: రోహిత్‌ లేకుంటే ఫ్రీ హ్యాండ్‌ తీసుకుంటారా!

Virat Kohli: 'డియర్‌ అనుష్క ఈ సెంచరీ నీకే అంకితం'

Virat Kohli: 'కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 

>
మరిన్ని వార్తలు