Virat Kohli- Anushka Sharma: స్కూటర్‌పై రైడ్‌కు వెళ్లిన విరుష్క జంట.. వీడియో వైరల్‌

20 Aug, 2022 21:44 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ ముంబై వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఎప్పడూ లగ్జరీ కారుల్లో ప్రయాణించే ఈ జంట.. ఈ సారి స్కూటీపై దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. శనివారం విరుష్క జంట స్కూటర్‌పై రైడ్‌కు వెళ్లారు. కోహ్లి స్కూటీని నడుపుతుండగా వెనుక అనుష్క కూర్చోని ఉంది.

అయితే వీరిద్దరూ హెల్మెట్‌లు ధరించినప్పటికీ తమ ఆరాధ్య క్రికెటర్‌ను అభిమానులు గుర్తుపట్టేశారు. ఈ క్రమంలో కోహ్లి, అనుష్క స్కూటర్‌పై వెళ్తుండగా అభిమానులు వీడియోలను తమ ఫోన్‌లలో చిత్రీకరించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియాలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత కోహ్లి జట్టుకు దూరంగా ఉన్నాడు. కోహ్లి మళ్లీ ఆసియాకప్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఆసియాకప్‌-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరనగుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది.

A post shared by NDTV (@ndtv)

మరిన్ని వార్తలు