Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు! మరీ చెత్తగా..

16 Feb, 2024 10:39 IST|Sakshi

Virat Kohli- Anushka Sharma To Be Born 2nd Child Rumours: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ దంపతుల గురించి నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంక చేసిన పోస్ట్‌ ఇందుకు కారణం. 

కాగా విరుష్క జోడీ రెండో సంతానం గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. అనుష్క గర్భవతి అంటూ ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

తికమక పెట్టిన డివిలియర్స్‌
ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడం.. ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అదే విధంగా.. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌, కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్‌ సైతం విరుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని తన యూట్యూబ్‌ చానెల్‌లో వెల్లడించాడు.

అయితే, వెంటనే మాట మార్చి తాను తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యానంటూ కోహ్లి- అనుష్కలను క్షమాపణలు కోరాడు. ఈ క్రమంలో.. డివిలియర్స్‌ తొలుత చెప్పిందే నిజమని.. అయితే, అనుష్క శర్మ ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉన్న కారణంగానే అతడు ఈ మేరకు ప్రకటన చేశాడని ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌ వైరల్‌ అయింది.

దీంతో.. విరుష్క అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అనుష్క ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నామంటూ పోస్టులు పెట్టారు. తాజాగా హర్ష్‌ గోయెంక పరోక్షంగా కోహ్లి- అనుష్కల రెండో సంతానం గురించి కామెంట్‌ చేశారు.

ఆ బిడ్డ క్రికెటర్‌ లేదంటే సినిమా స్టార్‌
‘‘మరికొన్ని రోజుల్లో ఓ బిడ్డ ఈ ప్రపంచంలోకి రానుంది! ఆ బేబీ తన తండ్రిలాగే క్రికెట్‌లో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందో.. లేదంటే.. తన తల్లిలా సినిమా స్టార్‌ అవుతుందో?!’’ అని గోయెంక ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇందుకు #MadeInIndia #ToBeBornInLondon అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు.

మీకు ఆ హక్కు లేదు.. చెత్తగా మాట్లాడుతున్నారు
ఈ నేపథ్యంలో ప్రసవం కోసం విరాట్‌ అనుష్కను లండన్‌ తీసుకువెళ్లాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం హర్ష్‌ గోయెంక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోకి రాకముందే.. క్రికెటర్‌ లేదంటే ఫిల్మ్‌ స్టార్‌ అంటూ భారం మోపడం సరికాదు.

పుట్టబోయే ఏ బిడ్డకైనా తమకు నచ్చిన రంగం ఎంచుకోవడం, నచ్చిన పని చేయడం వారి హక్కు. దాన్ని కాలరాసేలా మీరు మాట్లాడుతున్నారు. అయినా.. ఇండియాలో తయారై.. లండన్‌లో అంటూ ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ఏమిటి? మరీ చెత్తగా ఉంది’’ అని మండిపడుతున్నారు. 

కాగా క్రికెట్‌ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మను 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సెలబ్రిటీ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. ఇక రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు వీరు సిద్ధమవుతున్నారనే వార్తలపై విరుష్క అధికారికంగా స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.

చదవండి: BCCI: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లకు జై షా వార్నింగ్‌.. ఇకపై

whatsapp channel

మరిన్ని వార్తలు