U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్!

29 Jan, 2023 20:14 IST|Sakshi

తొలి అండర్‌-19 మహిళల టీ20 ప్రపం‍చకప్‌ విజేతగా భారత్‌  నిలిచింది. సెన్వెస్ పార్క్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7వికెట్ల తేడాతో చిత్తు చేసి జగ్జేతగా భారత్‌ అవతరించింది. 69 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ (15), గొంగడి త్రిష (24),సౌమ్య తివారి (23) పరుగులతో రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. భారత బౌలర్లు విజృంభించడంతో 68 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో టిటాస్‌ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించగా.. మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ సాధించారు.

అర్చన సూపర్‌ క్యాచ్‌..
ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో భారత క్రికెటర్‌ అర్చన దేవి సంచలన క్యాచ్‌తో మెరిసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన పార్షవి చోప్రా బౌలింగ్‌లో రియానా మెక్‌డొనాల్డ్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌ ఆడింది. ఈ క్రమంలో  మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అర్చన  కుడివైపుకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ అం​ందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు