ఆర్చరీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి

15 Jan, 2023 10:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కోల్‌కతాలో రెండు రోజులపాటు జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ట్రయల్స్‌లో విజయవాడకు చెందిన 26 ఏళ్ల జ్యోతి సురేఖ డబుల్‌ 50 మీటర్ల రౌండ్‌లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లు సాధించింది.

తొలి రోజు 72 బాణాలు, రెండో రోజు మరో 72 బాణాలు ఉపయోగించారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో బ్రిటన్‌ ఆర్చర్‌ ఎల్లా గిబ్సన్‌ 1417 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. 24 మంది ఆర్చర్లు పాల్గొన్న సెలెక్షన్‌ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ట్రయల్స్‌ ద్వారా ఈ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీలలో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వార్తలు