భళా ఆర్చర్‌.. నిలకడగా ఆడుతున్న ఢిల్లీ

14 Oct, 2020 20:22 IST|Sakshi

దుబాయ్‌ : రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ నిలకడగా సాగుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుకే ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం వచ్చిన రహానే ఆర్చర్‌ బంతులను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలనే రెండో ఓవర్‌ వేసిన ఆర్చర్‌ మూడో బంతికి రహానేను అవుట్‌ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తొలి స్పెల్‌లో జోఫ్రా ఆర్చర్‌ ప్రతీ బంతిని 140 కిమీ పైనే స్పీడుతో వేయడం విశేషం. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన ఆర్చర్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

రహానే అవుట్‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా మరో ఓపెనర్‌ ధవన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కార్తిక్‌ త్యాగి వేసిన 6వ ఓవర్లో ధవన్‌ బౌండరీలతో విరుచుకుపడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ధవన్‌ 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకోగా.. అయ్యర్‌ 28 పరుగులతో ఆడుతున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు