చెస్‌ టోర్నీ విజేత అర్జున్‌

9 Jul, 2022 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అండర్‌ –19 జూనియర్‌ చెస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్‌ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్‌ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్‌లో చల్లా సహర్షపై అర్జున్‌ గెలుపొందాడు.

ఈ టోర్నీలో అర్జున్‌ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్‌ బాషిక్‌ ఇమ్రోజ్‌ (నల్లగొండ) రన్నరప్‌గా, సీహెచ్‌ కార్తీక్‌సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్‌ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

మరిన్ని వార్తలు