national chess championship 2022: విజేతగా అర్జున్‌.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు

4 Mar, 2022 08:07 IST|Sakshi

కాన్పూర్‌: టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ సీనియర్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సీనియర్‌ టైటిల్‌ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్‌ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్‌ మాజీ చాంపియన్‌ సేతురామన్‌ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్‌ రేసులో ఉన్న గుకేశ్‌కు గురువారం ఇనియన్‌ జతయ్యాడు.

గుకేశ్‌ కూడా ఆర్యన్‌ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్‌... మిత్రభా గుహా (బెంగాల్‌)ను ఓడించాడు. దీంతో అర్జున్‌తో పాటు తమిళ గ్రాండ్‌ మాస్టర్లు గుకేశ్, ఇనియన్‌ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్‌ స్కోరుతో అర్జున్‌ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

చదవండి: టీమ్‌ ఈవెంట్‌లో ఇషాకు స్వర్ణం

మరిన్ని వార్తలు