Pole Vault: తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు..

9 Mar, 2022 08:08 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ మోండో డుప్లాంటిస్‌ పోల్‌ వాల్ట్‌లో మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెల్‌గ్రేడ్‌ ఇండోర్‌ మీటింగ్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో 22 ఏళ్ల ఈ స్వీడన్‌ ప్లేయర్‌ 6.19 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో గ్లాస్గో టోర్నీలో 6.18 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్‌ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా డుప్లాంటిస్‌కిది మూడో ప్రపంచ రికార్డు. ఈనెల 18 నుంచి బెల్‌గ్రేడ్‌లోనే జరగనున్న ప్రపంచ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌లో డుప్లాంటిస్‌ బరిలోకి దిగనున్నాడు. 

మరిన్ని వార్తలు