Nathon Lyon: వికెట్‌ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర

11 Dec, 2021 07:46 IST|Sakshi

Nathan Lyon 400 Wicket Milestone In Test Cricket.. ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ టెస్టుల్లో 400వ వికెట్‌ మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మలాన్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. లియోన్‌ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌(708 వికెట్లు), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఓవరాల్‌గా చూసుకుంటే 400 వికెట్ల మార్క్‌ను చేరుకున్న 17వ బౌలర్‌గా నిలిచాడు.  

చదవండి: Ashes Series: ఓవైపు మ్యాచ్‌.. మరోవైపు ప్రపోజల్‌..

ఇక్కడ మరో విశేషమేమిటంటే నాథన్‌ లియోన్‌ గతేడాది జనవరిలో ఇదే  గబ్బా మైదానంలో టీమిండియాతో జరిగిన టెస్టులో వాషింగ్టన్‌ సుందర్‌ను ఔట్‌ చేయడం ద్వారా 399 వ వికెట్‌ సాధించాడు. అప్పటినుంచి దాదాపు ఏడాదిపాటు ఒక వికెట్‌ తీయడం కోసం ఎదురుచూడడం ఆసక్తి కలిగించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ఎక్కువగా టెస్టులు ఆడకపోవడం.. గాయాలతో లియోన్‌ దూరమవ్వడం.. ఇక తాను  ఆడిన రెండు, మూడు టెస్టులోనూ లియోన్‌ 33 ఓవర్లపాటు బౌలింగ్‌ చేసినా వికెట్‌ తీయలేకపోయాడు. ఎట్టకేలకు యాషెస్‌ సిరీస్‌లో వికెట్‌ తీయడం ద్వారా లియోన్‌ చరిత్ర సృష్టించాడు. 

చదవండి: Ashes Test Series: మార్క్‌వుడ్‌ బీమర్‌.. బ్యాట్స్‌మన్‌ దవడ పగలింది

మరిన్ని వార్తలు