Ravichanran Ashwin: ‘‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్‌ చేసేయండి’ ’ 

18 Mar, 2022 07:47 IST|Sakshi

‘మన్కడింగ్‌’ విషయంలో ఎంసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై భారత స్పిన్నర్‌ అశ్విన్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇకపై దీనిని రనౌట్‌ అని ప్రకటిస్తూ, నాన్‌ స్ట్రైకర్‌ క్రీజ్‌ బయట ఉంటే తప్పు అతడిదే తప్ప బౌలర్‌ది కాదని కొత్త నిబంధనల్లో స్పష్టం చేశారు. ‘నా బౌలర్‌ మిత్రులారా... నాన్‌స్ట్రైకర్‌ ఒక అడుగు బయట ఉంచి అదనపు ప్రయోజనం తీసుకుంటే అది మీ కెరీర్‌లనే నాశనం చేయవచ్చు. కాబట్టి రెండో ఆలోచన లేకుండా అతడిని రనౌట్‌ చేసేయండి’ అని అశ్విన్‌ సూచించాడు.

ఇక 'మన్కడింగ్‌' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇంతకు ముందు మన్కడింగ్‌ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్‌ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. 2019 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ తరుపున ఆడిన అశ్విన్‌... రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్‌ అనేది క్రికెట్‌ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్‌ ఫా​న్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్‌ తీరుపై మండిపడ్డారు. రూల్‌ ఉన్నప్పుడు మన్కడింగ్‌ చేస్తే తప్పేంటని అశ్విన్‌ సమర్థించుకున్నాడు. 

ఇటీవలే క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీసీ) మన్కడింగ్‌ తప్పు కాదని పేర్కొంది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా క్రికెట్‌ నిబంధనల్లో లా-41 (క్రీడాస్పూర్తికి విరుద్ధం) నుంచి లా-38(రనౌట్‌)కు మార్చారు. రానున్న అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

చదవండి: David Warner: వార్నర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏమైనా చేశావా?!

Sanju Samson: కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా!

New Rules Of Cricket 2022: మన్కడింగ్‌ తప్పుకాదు: ఐసీసీ

మరిన్ని వార్తలు