ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

27 Apr, 2022 09:56 IST|Sakshi

Asia Badminton Championship - మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–13, 21–9తో అపీలుక్‌ గతెరాహోంగ్‌–నచానన్‌ తులమోక్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచింది.

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ (భారత్‌) జోడీ 10–21, 21–19, 16–21తో కాంగ్‌ మిన్‌హుక్‌–కిమ్‌ వన్‌హో (దక్షిణ కొరియా) జంట చేతిలో... అర్జున్‌ –ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 16–21, 22–24తో ఫజార్‌ –అర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఇషాన్‌ భట్నాగర్‌–తనీషా క్రాస్టో (భారత్‌) జంట 21–15, 21–17తో లా చెక్‌ హిమ్‌–యెంగ్‌ టింగ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గగా... వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌–జూహీ దేవాంగన్‌ (భారత్‌) ద్వయం 9–21, 13–21తో ప్రవీన్‌ జోర్డాన్‌–మెలాతి ఒక్తావియాంతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.  

చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా!

మరిన్ని వార్తలు