PAK Vs HK Asia Cup 2022: పాక్‌కు చావోరేవో.. గెలిస్తే సూపర్‌-4కు; ఓడితే ఇంటికి

2 Sep, 2022 19:20 IST|Sakshi

ఆసియా కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌ తమ రెండో మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌తో తలపడనుంది. టాస్‌ గెలిచిన హాంకాంగ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం(సెప్టెంబరు 2)న గ్రూప్‌-ఏలోని ఈ రెండు జట్లు సూపర్‌-4లో ఎంట్రీ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లకు ఇది చావో రేవో మ్యాచ్‌ లాంటిది. అయితే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి.. హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేయకూడదు.

టీమిండియాతో జరిగిన గత మ్యాచ్‌లో 192 పరుగుల లక్ష్య ఛేదనలో హాంకాంగ్‌ తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హాంకాంగ్‌ టాప్‌-3 బ్యాటర్స్‌ నిజఖత్‌ ఖాన్‌, బాబర్‌ హయత్‌, యాసిమ్‌ ముర్తజాలు ఎంత తొందరగా ఔట్‌ చేస్తే అంత మంచిది. ఈ ముగ్గురి తర్వాత ఆడేవారు ఎవరు లేకపోవడం హాంకాంగ్‌కు నష్టం కలిగించే అంశం.

ఇక టీమిండియాతో మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను హాంకాంగ్‌తో చేయకూడదని పాకిస్తాన్‌ భావిస్తుంది. గత మ్యాచ్‌లో విఫలమైన బాబర్‌ ఆజం హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. మహ్మద్‌ రిజ్వాన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్ ఫఖర్‌ జమాన్‌లు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. మిడిలార్డర్‌లో ఇఫ్తికర్‌ అహ్మద్‌, కుష్‌దిల్‌ షాలు ఉండగా.. లోయర్‌ ఆర్డర్‌లో షాదాబ్‌ ఖాన్‌, ఆసిఫ్‌ అలీ బ్యాట్‌ను ఝులిపించగల సమర్థులు. టీమిండియాతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఆకట్టుకున్న నసీమ్‌ షా మరోసారి ప్రభావితం చూపిస్తే హాంకాంగ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇతనికి తోడుగా హారిస్‌ రౌఫ్‌, మహ్మద్‌ నవాజ్‌, షాహనాజ్‌ దహనీలు ఉన్నారు.

పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర​‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షానవాజ్ దహానీ

హాంకాంగ్‌ జట్టు: నిజాకత్ ఖాన్ (కెప్టెన్‌), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్‌కెచ్నీ (వికెట్‌ కీపర్‌), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్
 

మరిన్ని వార్తలు