Hardik Pandya: భార్యపై ప్రేమను చాటుకున్న హార్దిక్‌! మిస్‌ యూ లవ్‌! ఫొటోలు వైరల్‌!

21 Aug, 2022 17:38 IST|Sakshi
భార్య నటాషాతో హార్దిక్‌ పాండ్యా(PC: Hardik Pandya)

Hardik Pandya- Natasa Stankovic Photos Goes Viral: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఐపీఎల్‌-2022కు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్‌ రాత.. కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్‌ అరంగేట్ర సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది.

తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాకు తాజా సీజన్‌ మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. కేవలం సారథిగానే కాకుండా.. బ్యాటర్‌గా.. బౌలర్‌గానూ హార్దిక్‌ అద్భుతంగా రాణించాడు. 15 ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేయడంతో పాటుగా... 10 ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి బౌలర్‌గానూ ఆకట్టుకున్నాడు. 

ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో భారత జట్టులో పునరాగమనం చేసిన హార్దిక్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు సారథిగా విదేశీ గడ్డపై రెండు విజయాలు నమోదు చేశాడు. ఇక ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20కి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించి గెలుపు అందుకున్నాడు. 


(PC: Hardik Pandya)

ఇదే జోష్‌లో ఆసియా కప్‌-2022 టోర్నీ ఆడే జట్టుకు ఎంపికైన హార్దిక్‌ పాండ్యా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు పయనమవుతున్నాడు. ఆగష్టు 28న దాయాది పాకిస్తాన్‌తో ఈ మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో ఆతిథ్య దేశానికి బయల్దేరుతున్నాడు. కెరీర్‌ విషయం ఇలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడన్న సంగతి తెలిసిందే.

భార్య నటాషా, కొడుకు అగస్త్యకు తగినంత సమయాన్ని కేటాయిస్తాడు. ఒక్కోసారి విదేశీ టూర్లలో ఉన్నపుడు మాత్రం వాళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో యూఏఈకి బయల్దేరే ముందు హార్దిక్‌ తన భార్య నటాషాపై ప్రేమను చాటుకుంటూ ఓ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

గంటల వ్యవధిలోనే ఇవి వైరల్‌ అయ్యాయి. మిలియన్‌కు పైగా లైకులు సాధించాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో ఏంటా ఫొటోలు.. టూ మచ్‌’’ అంటూ వివిధ రకాల ఎమోజీలతో సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇక భర్త పోస్టుకు స్పందించిన నటాషా.. ‘మిస్‌ యూ’ అంటూ లవ్‌ ఎమోజీతో బదులివ్వడం విశేషం.
చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!
Yuzvendra Chahal Wife: నాకు రెస్ట్‌ అవసరమైన సమయంలోనే ఇలాంటివన్నీ! నువ్వు నా దానివి!

మరిన్ని వార్తలు