Asia Cup 2022: 'కేఎల్‌ రాహుల్‌ స్ధానంలో అతడిని ఎంపిక చేయాల్సింది'

27 Aug, 2022 16:20 IST|Sakshi
PC: Cricfit.com

ఆసియాకప్‌-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో మ్యా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్‌ జట్లు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక భారత్‌ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇక ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు భారత జట్టును ఉద్దేశించి పాక్‌ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌ భారత జట్టులో రాహుల్‌కు బదులుగా యువ ఆటగాడు సంజూ శాంసన్ ఉండి ఉంటే బాగుండేది అని కనేరియా అభిప్రాయపడ్డాడు.

రాహుల్‌ స్థానంలో సంజూని ఎంపికచేయాల్సింది!
ఈ నేపథ్యంలో క్రికెట్‌ నెక్ట్స్‌.కామ్‌తో కనేరియా మాట్లాడుతూ.. "కేఎల్ రాహుల్‌ తాజాగా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. అతడు జింబావ్వే సిరీస్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు. రాహుల్‌ తిరిగి తన రిథమ్‌ను పొందడానికి కాస్త సమయం పడుతుంది. అతడికి మరింత ప్రాక్టీస్‌ అవసరం. నా వరకు అయితే రాహుల్‌ని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవాల్సింది.

రాహుల్‌ స్థానంలో సంజూ శాంసన్‌ వంటి యువ ఆటగాడిని ఎంపిక చేయాల్సింది. శాంసన్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శాంసన్‌కు భారత్‌ తరుపున ఆడే అవకాశాలు చాలా తక్కువగా లభించాయి. చాలా కాలం అతడు జట్టు బయటే ఉన్నాడు. అయితే రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టాక శాంసన్‌కు టీమిండియా తరపున ఆడే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఎందుకంటే సంజూ ఎంత ప్రతిభావంతుడో ద్రవిడ్‌కు బాగా తెలుసు" అని పేర్కొన్నాడు. ఈ ఏడాది స్వదేశంలో ప్రోటీస్‌తో జరిగిన సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన రాహుల్‌ తిరిగి జింబాబ్వే సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండిAsia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. దీపక్‌ హుడాకు నో ఛాన్స్‌! అశ్విన్‌కు కూడా!

మరిన్ని వార్తలు